‘సోగ్గాడే చిన్ని నాయానా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా హీరో నాగార్జున, దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘బంగార్రాజు: సోగ్గాడుమళ్లీ వచ్చాడు’. ఈ సినిమాలో నాగచైతన్య, కృతీశెట్టి ఇతర ప్రధానతారలు. ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్‌ మైసూర్‌లో జరుగుతుంది.గురువారం బంగార్రాజు చిత్రంలోని కృతీశెట్టి క్యారెక్టర్‌ నాగలక్ష్మీ లుక్‌ను అధికారికంగా విడుదల చేశారు. ‘లేడీస్‌ ఫస్ట్‌’ అంటూ నాగచైతన్య ఈ లుక్‌ను రిలీజ్‌ చేశారు. బంగార్రాజు చిత్రం సంక్రాంతికి విడుదల అవుతుందనే ప్రచారం జరుగుతుంది.

By Vissu