అఖండ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూసిన బాలకృష్ణ అభిమానులకు ‘అఖండ’ ట్రైలర్‌ ట్రీట్‌తో పాటు, అఖండ సినిమాను డిసెంబరు 2న రిలీజ్‌ అవున్నట్లుగా అనౌన్స్‌మెంట్‌ రావడం బాలకృష్ణ అభిమానులకు ఖుషీ చేసింది. కానీ ఒక్కరోజు తర్వాత వచ్చిన వరుణ్‌తేజ్‌ గని ట్రైలర్, రిలీజ్‌ డేట్‌ బాక్సాఫీస్‌ ఈక్వె షన్స్‌ను మార్చేసింది. తొలుత డిసెంబరు 3న విడుదలకు షెడ్యూలైన గని సినిమా డిసెంబరు 24కు వాయిదా పడింది. అయితే ఇదే రోజు నాని శ్యామ్‌సింగరాయ్‌ రిలీజ్‌డేట్‌ను ఫిక్స్‌ చేసుకుంది. దీంతో క్రిస్మస్‌ఫెస్టివల్‌ సీజన్‌ను సోలోగా క్యాష్‌ చేసుకుందామనుకున్న నానికి వరుణ్‌తేజ్‌ రూపంలో షాక్‌ తగిలింది. ఇలా బాలయ్య దెబ్బకు వరుణ్‌తేజ్‌ నానిని టార్గెట్‌ చేయాల్సి వచ్చింది. మరి.. ఈ ఇద్దరి యంగ్‌ హీరోస్‌లో బాక్సాఫీస్‌ హీరో ఎవరో తెలియడానికి కాస్త సమయం పడుతుంది.

By Vissu