రామ్‌చరణ్‌ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రాలు విడుదలకు సిద్ధమౌతున్నాయి. ఆల్రెడీ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రామ్‌చరణ్‌ అంగీకరించారు. ఈ సినిమా షూటింగ్‌ ఓ పాటతో ఈ నెల 21 నుంచి పుణేలో ప్రారంభం అవుతంది. ఈ పాటలో ఈ చిత్రం హీరోయిన్‌ కియారా అద్వానీ కూడా పాల్గొంటారు. అయితే ఈ సినిమా తర్వాతి చిత్రాన్ని కూడా ప్రకటించేశారు రామ్‌చరణ్‌. నాని ‘జెర్సీ’తో జాతీయఅవార్డు సాధించిన గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ తర్వాతి సినిమా ఖరారైంది. రీసెంట్‌గా బాలీవుడ్‌ హీరో షాహిద్‌కపూర్‌తో ‘జెర్సీ’ సినిమా హిందీ రీమేక్‌ ‘జెర్సీ’ని కంప్లీట్‌ చేశారు గౌతమ్‌ తిన్ననూరి. ఇప్పుడు రామ్‌చరణ్‌తో సినిమా చేసే చాన్స్‌ను దక్కించు కున్నాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఎన్వీఆర్‌ సినిమా నిర్మించనున్నారు. ఇలా రామ్‌చరణ్‌ నుంచి వరుస సినిమాల అప్‌డేట్స్‌ వస్తుండటం ఆయన ఫ్యాన్స్‌ను ఫుల్‌ ఖుషీ చేస్తుంది.

By Vissu