రామ్‌చరణ్‌ ఇప్పటికే ‘ఆచార్య’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాల్లో నటించాడు. ఇవి విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ తరుణంలోనే రామ్‌చరణ్‌ శంకర్, గౌతమ్‌ తిన్ననూరిలతో సినిమాలను కూడా ఒకే చేశాడు. ఇదే స్పీడ్‌లో ప్రశాంత్‌ నీల్‌తో కూడా ఓ సినిమాను సెట్‌ చేశాడు రామ్‌చరణ్‌. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌….ఇలా వరుసగా టాలీవుడ్‌ అగ్ర హీరోలతో సిని మాలు చేస్తూ మంచి ఊపులో ఉన్నారు కన్నడ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో పాటు ‘సలార్‌’ తర్వాత మళ్లీ ప్రభాస్‌తో వర్క్‌ చేస్తారు ప్రశాంత్‌ నీల్‌. ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు నిర్మిస్తారని తెలుస్తుంది. ప్రభాస్‌ కెరీర్‌ ఇది 24వ చిత్రం అవుతుంది. ప్రభాస్‌ 25వ చిత్రం ‘స్పిరిట్‌’కు సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

By Vissu