నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ చిత్రం విడుద‌ల తేదీ ఖ‌రారైంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబ‌రు 24న విడ‌ద‌ల కానుంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, త‌మిళం, క‌న్నడం, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుండ‌టం విశేషం. ఈ చిత్రంలో నాని బెంగాలీ కుర్రాడు వాసు పాత్ర‌లో క‌నిపిస్తారు. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్స్‌గా న‌టించారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం కీల‌క పాత్ర‌లు పోషించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌పై ప్రొడక్షన్ ప‌తాకంపై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ఈ సినిమాను నిర్మించారు.

By Vissu