ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి ప‌తాకంపై కిర‌ణ్ క‌ల్లాకురి నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం గ్రే. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌ మ‌దిరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ద స్పై హూ ల‌వ్డ్ మి అనేది ఉప‌శీర్షిక‌. ఈ సినిమా హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్‌ల్యాబ్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. మూహుర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వీఎన్. ఆదిత్య క్లాప్ ఇవ్వ‌గా, ప్ర‌సాద్ గ్రూప్స్ అధినేత ర‌మేష్ ప్ర‌సాద్ కెమెరా స్విఛ్చాన్ చేశారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత ల‌క్ష్మీ భూపాల్ స్క్రిప్ట్‌ను అంద‌జేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ వివేక్ కూచిబొట్ల ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ద‌ర్శ‌కుడు రాజ్‌ మ‌దిరాజు మాట్లాడుతూ – ఇదొక స్పై మూవీ. థ్రిల్ల‌ర్‌. న‌మ్మ‌లేని అంశాలు ఉంటాయి. తెలియ‌ని ఎక్స్‌ప్రెష‌నే గ్రే. అదే స్క్రీన్ పై క‌నిపిస్తుంది. క్యాస్టింగ్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాను. అలీ, అర వింద్‌, ఊర్వ‌శీ సెట్ అయ్యారు. ఈ నెల 22 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. డిసెంబ‌రు క‌ల్లా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి సంక్రాంతి సంద‌ర్భంగా ఈ సినిమాను విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాం అన్నారు.

ప్ర‌సాద్ గ్రూప్స్ అధినేత ర‌మేష్‌ ప్ర‌సాద్ మాట్లాడుతూ – రాజ్ ముదిరాజ్ మంచి ప్ర‌తిభావంతుడు. గ్రే సినిమాకు మంచి క్యాస్టింగ్ కుదిరింది. ఈ సినిమా విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వీఎన్‌ ఆదిత్య మాట్లాడుతూ – `కొత్త ద‌ర్శ‌కులు, కొత్త హీరో హీరోయిన్లు, ర‌చ‌యిత‌లు ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నారంటే నాకు పెద్ద‌గా సంతోషం ఉండదు.కానీ నిర్మాత‌లు వ‌స్తున్నారంటే ఎంతో ఆనందం. వారు సినిమాలు తీస్తుంటేనే కొత్త‌వారికి అవ‌కాశాలు వ‌స్తుంటాయి. అలీరెజా, అర‌వింద్ మంచి యాక్ట‌ర్స్‌. అర‌వింద్‌కు ఈ సినిమాతో మంచి బ్రేక్ వ‌స్తుంద‌ని అనుకుంటు న్నాను. కిర‌ణ్‌గారు ఫ్రెండ్‌. నిర్మాత‌లు మంచి నిర్మాణ విలువ‌ల‌తో ఈ సినిమాను తీస్తార‌ని న‌మ్ముతున్నా“ అన్నారు.

ర‌చ‌యిత ల‌క్ష్మీభూపాల్ మాట్లాడుతూ – రాజ్‌ముదిరాజుగారు గ్రే అనే సినిమాను స్టార్ట్ చేయ‌డం ఆనందంగా ఉంది. ఈ సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌. తెలుగు సినిమాలు డాక్యూమెంట‌రీగా వ‌స్తు న్నాయి. డ్రామా ఉండ‌టం లేదు. క‌థ‌లు కొన్నే ఉంటాయి. ఎమోష‌న్స్ అవే. కానీ ఈ క‌థ నాకు న‌చ్చింది. ఎందుకంటే టెక్నిక్ బాగుంది. తెలుగు సినిమా నెక్ట్స్ స్థాయికి వెళ్లాల్సింది టెక్నిక్‌లోనే. ఈ చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌అన్నారు.

నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ- రాజ్‌ముదిరాజుగారు మంచి యాక్ట‌ర్‌, డైరెక్ట‌ర్‌. చిత్ర‌యూనిట్ కు ఆల్ ది బెస్ట్‌. అన్నారు

న‌టుడు అలీ రెజా మాట్లాడుతూ – ర‌మేష్‌గారు చెప్పిన మాట‌లు స్ఫూర్తిదాయ‌కం. రెండు రోజుల‌కు ముందు నేను ఓ క్యారెక్ట‌ర్ చేయ‌నున్న సినిమా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గ్రే ఓపెనింగ్‌. మ‌రో రెండు రోజుల్లో తండ్రిని కాబోతున్నాను. అంద‌రి ఆశీస్సుల వ‌ల్లే ఇది జ‌రుగుతుంది. రాజ్‌గారితో నేను చేయాల్సిన ఓ సినిమా ఆగిపోయింది. ఆ త‌ర్వాత రాజ్‌గారు గ్రే సినిమా చెప్పారు. క‌థ బాగా న‌చ్చింది. ఏడాది త‌ర్వాత కూడ న‌న్ను గుర్తు పెట్టుకుని అవ‌కాశం ఇచ్చిన రాజ్‌గారికి థ్యాంక్స్‌. అర‌వింద్‌, ఉర్వ‌శీల‌తో యాక్ట్ చేయ‌డానికి ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నాను.

నిర్మాత కిర‌ణ్ క‌ల్లాకురి మాట్లాడుతూ – ఈ సినిమా కోసం రాజుగారు, ర‌మేష్‌చ‌ద‌ల‌వాడ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. సినిమాకు డ‌బ్బులు పెట్ట‌డం సులువే. కానీ మంచి అవుట్‌పుట్ ఇవ్వ‌డం క‌ష్టం. గ్రే మంచి సినిమా అవు తుంద‌ని న‌మ్ము తున్నాను. థ్రిల్ల‌ర్ సినిమాలు పెద్ద‌గా తెలుగులో రాలేదు. గ్రే మంచి థ్రిల్ల‌ర్ మూవీ అన్నారు.

న‌టుడు అర‌వింద్ కృష్ణ మాట్లాడుతూ- గ్రే మంచి మూవీ. ఆడియ‌న్స్‌కు న‌చ్చుతుంది. అన్నారు

హీరోయిన్ ఊర్వ‌శీ మాట్లాడుతూ – క‌థ బాగా న‌చ్చింది. ఎగ్జైటింగ్‌గా అనిపించింది. కాస్త నెర్వ‌స్‌గా ఉంది. నాకు మంచి కో స్టార్స్ దొరికారు. న‌న్ను న‌మ్మిన రాజ్ ముదిరాజుగారికి, నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు“ అన్నారు

స‌హ నిర్మాత శ్రీదేవి మాట్లాడుతూ – ఈ సినిమా నిర్మాత కిర‌ణ్ నా త‌మ్ముడు. ఈ సినిమాలో భాగ‌మ‌వ్వ మ‌న్న‌ప్పుడు క‌థ విన్నాను. న‌చ్చింది. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌నే అనుకుంటున్నాను.

నటి న‌జియా మాట్లాడుతూ – ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. నేను చేస్తున్న‌తొలి సినిమా ఇది అన్నారు

By Vissu