ఆగస్టు 22న చిరంజీవి బర్త్‌ డే. చిరంజీవి 153వ సినిమా టైటిల్‌ (గాడ్‌ఫాదర్‌), 155వ సినిమా టైటిల్‌ (భోళాశంకర్‌), 154వ సినిమా అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్స్‌ వచ్చాయి. కానీ చిరంజీవి నటిస్తున్న 152వ సినిమా ఆచార్య నుంచి మాత్రం ఓ పోస్టర్‌ మాత్రమే విడుదలైంది. ఆ పోస్టర్‌ కూడా చిరంజీవి పుట్టిన రోజు ముందు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టిన పోస్టరే. అయితే చిరంజీవి బర్త్‌ డే సందర్భంగా ‘ఆచార్య’ సినిమా రిలీజ్‌ డేట్‌ను అందరు ఎక్స్‌పెక్ట్‌ చేశారు. కానీ రిలీజ్‌ డేట్‌ రాలేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పోస్ట్‌పోన్‌అయితే దసరాకు ఆచార్య వస్తాడని అనుకున్నారు. ఇప్పుడు రిలీజ్‌పై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వెనక్కి తగ్గింది. కానీ ‘ఆచార్య’ మాత్రం రిలీజ్‌ విషయంలో ఇంకా కన్‌ఫ్యూజ్‌ అవుతూనే ఉన్నారు. సంక్రాంతికి వద్దామని ‘ఆచార్య’ గట్ట ప్రయత్నాలే చేశారు. కానీ ఇప్పటికే మహేశ్‌బాబు ‘సర్కారువారిపాట’, పవన్‌కల్యాన్‌ ‘భీమ్లానాయక్‌’, వెంకీ–వరుణ్‌ల ‘ఎఫ్‌ 3’, ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ సంక్రాంతికి రెడీ అనేశాయి. రీసెంట్‌ గా జనవరి 12న విడుదల కానున్న భీమ్లానాయక్‌ సినిమాను జనవరి 26న విడుదల చేసుకోమని కోరారట ‘ఆచార్య’ టీమ్‌. అందుకు ‘భీమ్లానాయక్‌’ టీమ్‌ ససేమీరా నో అని చెప్పారట. దీంతో మళ్లీ ఆచార్య రిలీజ్‌ కథ మొదటికొచ్చింది. మరి..ఆచార్య ఎప్పుడుస్తాడో! థియేటర్స్‌లో ఎప్పుడు కనిపిస్తాడో! ఫ్యాన్స్‌ను ఎప్పుడు అలరిస్తాడో!

By Viswa