అవును..రాజమౌళి డైరెక్షన్‌లోని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(రౌద్రం..రణం..రుధిరం) విడుదల కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటికే మూడుసార్లు (2020జూలై 30, 2021 జవనరి 8, 2021 అక్టోబరు 13) వాదాయి పడ్డ ఈ ప్యాన్‌ ఇండియన్‌ మూవీ మళ్లీ కొత్త రిలీజ్‌ డేట్‌ కోసం వెతుకులాట ప్రారంభించి సంక్రాంతిని టార్గెట్‌ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ ఇప్పటికే పవన్‌కల్యాణ్‌ ‘భీమ్లానాయక్‌’, మహేశ్‌బాబు ‘సర్కారువారిపాట’, ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’, వెంకటేశ్‌–వరుణ్‌ల ‘ఎఫ్‌3’లు రెడీ అయ్యాయి. ఆల్రెడీ రిలీజ్‌ డేట్స్‌ కూడా ప్రకటించాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రయూనిట్‌ తాము సంక్రాంతికి రాము అన్న తర్వాతే మిగతా చిత్రాలు సంక్రాంతికి రెడీ అవుతున్నారట. కానీ ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ ఫ్లేట్‌ ఫిరాయించి సంక్రాంతికి విడుదల అనుకుంటున్నామని, సహకరించాలని ఆల్రెడీ సంక్రాంతికి కర్చీఫ్‌ వేసిన చిత్రయూనిట్‌ నిర్మాతలో మంతనాలు మొదలు పెట్టిందట ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌. మరి…ఈ రిలీజ్‌ల కథ ఎటు వెళుంతుదో చూడ

By Viswa