సిద్ధార్థ్, శర్వానంద్‌ హీరోలుగా నటిస్తున్న ‘మహాసముద్రం’ సినిమా రిలీజ్‌ డేట్‌ ఖరారైంది. దసరా సందర్భంగా ఈ సినిమాను అక్టోబరు 14న విడుదల చేయనున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. అనూఇమ్మాన్యూయేల్, అతిదీరావ్‌ హైదరీ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటించారు. రామబ్రహ్మాం సుంకర నిర్మించిన ఈ సినిమాకు అజయ్‌ సుంకర కో ప్రొడ్యూసర్‌. జగపతిబాబు, రావురమేష్, కేజీఎఫ్‌ ఫేమ్‌ రామచంద్ర ఇందులో ఇతర పాత్రలు
పోషించారు.

By Vissu