బాక్సాఫీస్‌ వద్ద రజనీకాంత్, అజిత్‌ల వార్‌కు రంగం సిద్ధమౌతున్నట్లుగా కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తుంది. 2019లో కూడా రజనీకాంత్‌ నటించిన ‘పేట’, అజిత్‌ చేసిన ‘విశ్వాసం’ సినిమాలు ఒకే రోజున అంటే సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు మళ్లీ రజనీ, అజిత్‌ బాక్సాఫీసు సమరానికి సై అన్నట్లు తెలుస్తుంది. రజనీకాంత్‌ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన ‘అన్నాత్తే’, హెచ్‌. వినోద్‌ డైరెక్షన్‌లో అజిత్‌ నటించిన వలిమై’ చిత్రాలు ఒకే రోజున అంటే దీపావళి సందర్భంగా ఈ ఏడాది నవంబరు 4న విడుదల కానున్నా యనే టాక్‌ వినిపిస్తుంది. అయితే ‘వలిమై’ని మొదట్నుంచి ప్యాన్‌ ఇండియన్‌ మూవీగా చెప్పుకుంటున్నారు ఈ చిత్రయూనిట్‌. సౌత్‌లో థియేటర్స్‌ కంప్లీట్‌గా రీ ఓపెన్‌ అయితే అన్నాత్తేకి ప్రాబ్లమ్‌ లేదు. అయితే వలిమై నిర్మాత బోనీకపూర్‌ ఈ చిత్రాన్ని నార్త్‌ ఇండియాలో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలను కుంటున్నారు. మరి..నార్త్‌ ఇండియన్‌ బాక్సీఫీస్‌ మార్కెట్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని ‘వలిమై’ రిలీజ్‌ను డిసైడ్‌ చేయాలని బోనీకపూర్‌ భావిస్తున్నారు. ఒకేవేళ నవంబరు నాటికి కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ప్రభావం లేకుండా ఉండి, దేశవ్యాప్తంగా థియేటర్స్‌ రీ ఓపెన్‌ అయ్యే పరిస్థితులు ఉంటే మాత్రం బాక్సీఫీసు వద్ద రజనీ వర్సెస్‌ అజిత్‌ తప్పేలా లేదు. మరి..2019 సీన్‌ రీపీట్‌ అవుతుందా? వెయిట్‌ అండ్‌ సీ.

By Vissu