రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా నరకాసుర. ఈ చిత్ర
నిర్మాణంలో భాగమవుతూ దర్శకత్వం వహించారు సెబి జూనియర్. ఐడియల్ ఫిల్మ్మే కర్, సుముఖ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎ శ్రీనివాస్, ఎ రాఘవేందర్, కరుమూరు రఘు, సెబి జూనియర్ నిర్మిస్తున్నారు. అపర్ణ జనార్థన్ నాయిక. సంగీర్తన విపిన్ మరో నాయికగా నటిస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా నరకాసుర మూవీ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. ఢమరుకాన్ని పట్టుకున్న హీరో రక్షిత్ అట్లూరి తీక్షణంగా చూస్తున్న ఈ ఫస్ట్ లుక్ ఇంటెన్స్ గా ఉంది.
ఈ సందర్భంగా దర్శకుడు సెబి జూనియర్ మాట్లాడుతూ…ఆంధ్ర, తమిళనాడు
సరిహద్దుల్లోని ఓ కాఫీ, పెప్పర్ తోట నేపథ్యంగా నరకాసుర కథ సాగుతుంది. ఈ
తోటలో పనిచేసే రైతు, ట్రక్ డ్రైవర్ అదృశ్యం అవుతారు. వారిని వెతికే
క్రమంలో కథ అనేక ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. ఆ ట్విస్ట్స్ ఏంటి అనేది
నరకాసుర సినిమాలో చూడాలి. చింతపల్లి, కోరాపుట్, జబల్ పూర్ వంటి
లొకేషన్లలో షూటింగ్ చేశాం. చిత్రీకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. వచ్చే
ఏడాది ఫిబ్రవరిలో సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.