విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శ కత్వంలో రూపొందుతోన్న చిత్రం నార‌ప్ప‌. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నార‌ప్ప భార్య సుందరమ్మగా తెలుగు వారికి  చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూర్చిన ఈ చిత్రం నుండి ఫ‌స్ట్ సింగిల్ చలాకీ చిన్న‌మ్మీ..ఈ రోజు విడుద‌లైంది.
వెంకటేష్ ఫ్యామిలీ అంతా కలిసి తన కొడుకు పెళ్లి చూపులకు వెళ్లే నేప‌థ్యంలో వ‌చ్చే పాట ఇది. కార్తీక్ రత్నం ఈ చిత్రంలో వెంకటేష్ కొడుకుగా నటించిన విష‌యం తెలిసిందే..ఈ ఫ్యామిలీ పాట‌కు చిన్న రొమాంటిక్ ట‌చ్‌ని కూడా క‌లిపి మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్భుత‌మైన ట్యూన్ కంపోజ్ చేశారు. ఆదిత్య అయ్యంగార్‌, నూత‌న మోహ‌న్ శ్రావ్యంగా ఆల‌పించిన ఈ పాట‌కు అనంత శ్రీ‌రామ్ మంచి సాహిత్యాన్ని అందిం చారు. ఇప్ప‌టికే షూటింగ్, పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను ముగిశాయి. త్వ‌రలోనే విడుద‌ల తేదిని ప్ర‌క‌టించ‌నున్నారు మేక‌ర్స్‌. తమిళ హిట్ అసురన్ తెలుగు రీమేక్ గా నారప్ప రూపొందింది

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *