Vijay Deverakonda Kushi: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఖుషి (Vijay Deverakonda Kushi). గత నెల 23న ఈ సినిమా రెగ్యూలర్ చిత్రీకరణ కశ్మీర్లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో విజయ్ దేవరకొండ, సమం తలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ కశ్మీర్లో పూర్తయినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్, నవీన్ యేర్నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఖుషీ సినిమా తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఆ తర్వాత వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ చేయనున్నారు. అనుకున్న ప్రకారం షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాను ఈ ఏడాది డిసెంబరు 23న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ చిత్రంలో జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఇక కీర్తీ సురేశ్ టైటిల్ రోల్ చేసిన మహానటి చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ, కీర్తీ సురేశ్‌లు కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.
https://twitter.com/ShivaNirvana/status/1528557105153978368
Nagachithanya Akhil: తమిళ దర్శకులను నమ్ముకుంటున్న అక్కినేని హీరోలు
Amazing first schedule in kashmir
Thankyou @TheDeverakonda @Samanthaprabhu2 @vennelakishore #saranyapradeep and Whole #khushiteam 👏 congratulations
#khushiondec23 #khushi pic.twitter.com/jax2pkYRvS
— Shiva Nirvana (@ShivaNirvana) May 23, 2022