Prema Geema: జగపతిబాబు, అనసూయ, వశిష్ట్ ఎన్. సింహా, కబీర్ దుహాన్ సింగ్, ‘బిగ్‌బాస్’ ఫేమ్ దివి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబ: ది ఫారెస్ట్మేన్’. మురళీ మనోహర్ దర్శకత్వంలో డి. రాజేందర్‌రెడ్డి, దర్శకుడు సంపత్‌నంది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ప్రేమా గీమా ముచ్చట్లంటే నచ్చవురో నాకు…’(Prema Geema)అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. మిట్టపల్లి సురేందర్ సాహిత్యం అందించిన ఈ పాటను నిత్యాశ్రీ, వెంకట్రామన్ ఆలపించారు. ఈ సినిమాకు కృష్ణ సౌరభ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా విడుదలపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.
director vasist interview: ప్రతిరోజూ టైమ్ ట్రావెల్