Nagachithanya Akhil: అక్కినేని నాగార్జున వారసులుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్. యాక్టర్‌గా నాగచైతన్య ఒకింత ప్రేక్షకుల్లో మంచి మార్కులే దక్కించుకున్నారు. అయితే అఖిల్‌కు మాత్రం బిలో యావరేజ్ మార్కులే వేశారు ఆడియన్స్. కానీ ఈ ఇద్దరు హీరోలు ఎప్పట్నుంచో మాస్ హీరో ఇమేజ్ను దక్కించుకునేందు అపసోపాలు పడుతున్నారు. ‘దడ’, ‘బెజవాడ’, ‘యుద్ధం శరణం’ వంటి సినిమాలతో మాస్ ఇమేజ్ను దక్కించుకునేందుకు నాగచైతన్య చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. కానీ మాస్ ఇమేజ్ హీరో అని అనిపించుకునేందుకు మాత్రం నాగచైతన్య కష్టపడుతూనే ఉన్నారు. ఇందు కోసమే. .రీసెంట్గా తమిళంలో ‘మానాడు’ వంటి హిట్ ఫిల్మ్‌ను తీసిన వెంకట్‌ప్రభుతో సినిమాకు సై అన్నారు నాగచైతన్య. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమాతో అయిన మాస్ హీరో ఇమేజ్ దక్కు తుందనే ఆశలో ఉన్నారు నాగచైతన్య.
ఇటు ‘అఖిల్’, ‘హాలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి సినిమాలు చేశారు అఖిల్. వీటిలో ఏ చిత్రం కూడా అఖిల్‌ను యాక్టర్‌గా ఆడియన్స్‌కు చేరువకాలేదు.‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మాత్రం కాస్త ఫర్వాలేదనిపించిన అఖిల్‌కు మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక లవర్‌బాయ్ ఇమే జ్ను చేరిపేసి యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకోవాలని డిసైడైయ్యారు అఖిల్. దీంతో ‘రేసుగుర్రం’, ‘కిక్’, ‘ధృవ’ వంటి సినిమాలను తీసిన సురేందర్‌రెడ్డితో అఖిల్ ‘ఏజెంట్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ యాక్షన్ ఫిల్మ్పైనే అఖిల్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మరోవైపు ‘ఏజెంట్’ పూర్తి కాగానే తమిళ దర్శకుడు మోహన్‌రాజా దర్శకత్వంలో అఖిల్ నటిస్తారనే ప్రచారం ఇండస్ట్రీలో వినిపి స్తోంది. కథ చర్చలు కూడా జరిగాయట. ఇది కంప్లీట్ మాస్ ఫిల్మ్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్’ సినిమాకు మోహన్‌రాజా దర్శకత్వం వహిచారు. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఇలా మాస్ హీరో ఇమేజ్ను దక్కించుకునేందుకు అక్కినేని హీరోలు చేసే ప్రయత్నాలు సక్సెస్ కావాలని వారి ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.