
KGF(Kolar gold fields) Chapter 2 Review
మూవీ: కేజీఎఫ్ చాప్టర్ 2
ప్రధాన తారాగణం: యశ్, సంజయ్‌దత్, రవీనా టాండన్, ప్రకాశ్‌రాజ్, శ్రీనిధి శెట్టి
దర్శకుడు: ప్రశాంత్‌నీల్
మ్యూజిక్: రవిబస్రూర్
నిర్మాత: విజయ్ కిరగందూర్
రిలీజ్: ఏప్రిల్ 14

KGF(Kolar gold fields) Chapter 2 Review: ‘కేజీఎఫ్(కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) చాప్టర్1’ అద్భుతమైన విజయం సాధించింది. ఒకరకంగా చెప్పాలంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఈ సినిమాకు ఓ పేజీ ఉంది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో 100 కోట్లు వసూలు చేసిన సిని మా ఓ రికార్డు ఉంది. అలాంటిది ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2’ వస్తుదంటే ఈ సినిమాపై అంచనాలు లే కుండా ఎలా ఉంటాయి. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కేజీఎఫ్ చాప్టర్1తో పోలీస్తే సీక్వెల్‌గా వస్తున్నఈ కేజీఎఫ్ చాప్టర్ 2పైనే భారీగా అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పదివేల స్క్రీన్స్ కుపైగా రిలీజ్ చేస్తున్నారు. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ చాప్టర్ 2 ఎలా ఉంది అనే ఆసక్తికరమైన విషయంలోకి ఇప్పుడు వెళ్దాం.
కథ: ఆనంద్‌వాసిరాజు(అనంతనాగ్) చెప్పిన ‘కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్): ఛాప్టర్ 1’లో గరుడను రాకీభాయ్ ఆలియాస్ రాజాకృష్ణప్ప బైర్వా (యశ్) చంపడంతో ముగుస్తుంది. ఇక కేజీఎఫ్: ఛాప్టర్ 2 ఆనంద్‌వాసిరాజు తనయుడు విజయవాసిరాజు (ప్రకాశ్‌రాజ్) కంటిన్యూ చేస్తాడు. ఆనంద్ వాసిరాజుకు గుండెపోటు రావడంతో కేజీఎఫ్ కథను విజయ వాసిరాజు కంటిన్యూ చేస్తాడు. గరుడను చంపడంతో కేజీఎఫ్: చాప్టర్ 1 ముగుస్తుంది.నరాచీకి కొత్త ఎల్‌రాడో ఎవరు? అనే చర్చతో కేజీఎఫ్: ఛాప్టర్ 2 స్టార్ట్ అవుతుంది. అందరు గరుడ తమ్ముడు విరాట్‌ను అనుకుంటారు. కానీ రాకీభాయ్ గరడును చంపాడానికంటే ముందే అతడి తమ్ముణ్ని చంపుతాడు. ఇదే నరాచీ కొత్త లీడర్‌గా రాకీభాయ్ పనికిరాడని వాదిస్తాడు కమల్. పైగా అధికప్రసంగం చేస్తాడు. దీంతో రాకీభాయ్ అతడ్నీ స్పాట్‌లో చంపేస్తాడు. దీంతో చర్చకు వచ్చిన గురుపాండ్యన్ (అచ్చుత్ కుమార్), రాజేంద్ర దేశాయ్ ఒప్పుకోకతప్పదు. కానీ కేజీఎఫ్‌కు కొత్త లీడర్ రావడం గరుడకు మరో బ్రదర్ అయిన అధీర (సంజయ్‌దత్), ఇనాయత్‌ఖలీల్ (బాలకృష్ణ), శెట్టి(దీనేష్)లకు కూడా ఏ మాత్రం నచ్చదు. వీరందరు రాకీభాయ్ పతనాన్ని కోరుకుంటారు. ఇందుకు తగ్గట్లుగానే వ్యూహరచన చేస్తుంటారు. మరోవైపు సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్) డైరెక్టర్ కె.రాఘవన్ కూడా కేజీఎఫ్‌పై ప్రభుత్వం పట్టు ఉండాలని, కేజీఎఫ్ లీడర్‌ను అరెస్ట్ చేయాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. కానీ అతనికి రాజకీయంగా సపోర్ట్ ఉండదు. అయితే కేజీఎఫ్ అధిపతిగా రాకీభాయ్‌కు ఆదిలోనే అంతరాలు ఎదరవుతాయి. కేజీఎఫ్‌లో లోపల అధీర, బయట ఇనాయత్‌ఖలీల్, శెట్టిలు కలిసి రాకీభాయ్‌పై పతానానికి నాంది పలుకుతారు. మరి..వీరి వ్యూహాలకు రాకీభాయ్ ఎలాంటి ప్రతివ్యూహాలు పన్నాడు? కేజీఎఫ్ అధిపతిగా తన స్థానాన్ని ఎలా నిలపుకోగలిగాడు? ఇనాయత్ ఖలీల్, శెట్టి, అధీరలకు వెన్నంటి ఉండి నడిపిస్తున్న వ్యక్తిని రాకీభాయ్ ఎలా పట్టుకోగలిగాడు? రమికా సేన్(రవీనాటాండన్) ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత రాకీభాయ్ ఎలాంటి పరిస్థుతు లను ఎదుర్కొన్నాడు? అన్నది మిగిలిన కథ.
ఎలాఉందంటే: కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని దక్కించుకున్న రాకీభాయ్ ఈ స్థానాన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగాడు? ఎన్ని అవాంతరాలు ఉన్నాయి? అసలు..రాకీభాయ్ తల్లికి వచ్చిన మాట ఏంటి? అన్న అంశాలను దర్శకుడు ప్రశాంత్‌నీల్ బలంగానే చెప్పాడు. కేజీఎఫ్ చాప్టర్1లో ముందురాకీభాయ్ క్యారెక్టర్‌ను చూపించి, ఆ తర్వాత ఓడించి, ఆ నెక్ట్స్ బలంగా గెలిపించాడు దర్శకుడు ప్రశాంత్‌నీల్. కేజీఎఫ్ చాప్టర్2లోనూ ఇదే జరుగుతుంది. ఫస్టాప్‌లో రాకీభాయ్ ఎంట్రీ తర్వాత రాకీ తగ్గిపోవడం, మిగతారు బలంగా ఉండటం, మళ్లీ రాకీభాయ్ పుంజు కుని వారందర్నీ మట్టుబెట్టడం జరుగుతుంది. కానీ ఫస్టాఫ్‌లో రాకీభాయ్ ఎంట్రీ సీన్ తర్వాత వచ్చే నెపోటిజమ్ డైలాగ్స్, తుఫాన్ సాంగ్ అదిరిపోతాయి. ఇక రాకీభాయ్ ఎంట్రీ సీన్ కంటే అధీర ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. అధీర ఎంట్రీ సీన్‌లో చెప్పై డైలాగ్స్ భలేగా అనిపిస్తాయి. ఇక ప్రీ ఇంట్రవెల్‌లో వచ్చే ఫైట్ సీన్, ఇంట్రవెల్ బ్యాంగ్ అదుర్స్. ఇక సెకండాఫ్ స్టార్ట్‌కాగానే ఉండే యాక్షన్ బ్లాక్ గూస్‌బంప్స్. ఈ సీన్‌తో అధీర పాత్ర కాస్త నెమ్మదిస్తుంది. అయితే రాఘవన్, రమికాసేన్‌ల పాత్రలు ఊపందుకుంటాయి. సుల్తాన్ సాంగ్, అమ్మసెంటి మెంటల్ సాంగ్ ఒకే అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్‌లో అధీర, రాకీభాయ్‌ల మధ్య పోరు బాగుంటుంది. వీటికితోడు క్లైమాక్స్ ట్విస్ట్ బోనస్. అలాగే 400గ్రాముల బంగారం కోసం రాకీభాయ్ పోలీస్టేషన్‌కు వెళ్లిన సీన్ మరో హైలైట్. ఒక్కమాటలో చెప్పాలంటే యశ్ ఎగ్రెసివ్‌గా కనిపించే ప్రతిసీన్‌లోనూ ఎలివేషన్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. మాస్ ఆడియన్స్‌కు ఇవి బాగా నచ్చుతాయి. ఫైట్స్ కూడా విజువల్‌గా రిచ్‌గా ఉన్నాయి.
ఎవరు ఎలా చేశారంటే: కేజీఎఫ్: చాప్టర్1 కంటే చాప్టర్ 2 కోసం యశ్ ఎక్కువగా కష్టపడ్డట్లు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్‌లో యశ్ అదుర్స్ అనిపించాడు. కేవలం యాక్షన్ సీన్స్‌లోనే కాదు..కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో కూడా తన యాక్టింగ్ టాలెంట్‌ను ప్రదర్శించే అవకాశం యశ్‌కు దక్కింది. మరోవైపు కేజీఎఫ్: చాప్టర్1 లో దక్కని యాక్టింగ్ చాన్స్ సీక్వెల్‌లో శ్రీనిధి శెట్టికి దక్కింది. అధీరగా సంజయ్‌దత్ అదుర్స్ అనిపించాడు. ఇక అధీర కంటే ఒకమెట్టు ఎక్కువగానే రమికాసేన్‌గా రవీనాటాండన్ కనిపించారు. విజయ వాసిరాజుగా ప్రకాశ్ రాజ్, సీబీఐ డైరెక్టర్ రాఘవన్‌గా రావు రమేష్ ఫర్వాలేదనిపించారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో రమికాసేన్‌కు, రాఘవన్‌కు వచ్చే సీన్స్ బాగుంటాయి. దర్శకుడు ప్రశాంత్‌నీల్ గురించి చెప్పేది ఏమీ లేదు. మరోసారి అదుర్స్ అనిపించాడు. కానీ సెకండాఫ్‌లో కాస్త బోరింగ్ సీన్స్ ఉన్నాయి. కానీ కథ ముందుకు కదులుతున్నందుకున ఆడియన్స్‌కు బోరింగ్‌గా అనిపించదు. నిర్మాత విజయ్ కిరగందూర్ పెట్టిన ఖర్చు స్క్రీన్‌పై కనిపిస్తుంది. మ్యూ జిక్ డైరెక్టర్ రవిబస్రూర్ మ్యూజిక్, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ నెక్ట్స్ లెవల్లో కనిపిస్తాయి. ఇక రాకీభాయ్ అమ్మ పాత్రలో శాంతమ్మగా కనిపించిన అర్చనను మర్చిపోకూడదు. కథలో యాక్షన్ ఎక్కువైన ప్రతీసారి ఎమోషన్‌ను తీసుకువచ్చీ ఆడియన్స్ సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేస్తుందీ పాత్ర.
బలాలు
యశ్, సంజయ్‌దత్‌ల యాక్టింగ్
అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌స్
ప్రశాంత్ నీల్ కథ, కథనం
విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్
ఎమోషన్
బలహీనతలు
సెకండాఫ్‌లో కాస్త బోరింగ్
కామెడీ ఆశించేవారికి నిరాశ
ఫైనల్: మరోసారి మెప్పించిన రాకీభాయ్ (4/5)

Yash KGFchapter2 : ఆలోచిం చినప్పుడు పిచ్చోళ్లని అనుకుంటారు : యశ్
Yash K.G.F: Chapter 2: రాఖీభాయ్ తుఫాన్ వచ్చేసింది
Yash: It’s not politics. yash sensational comments on vijat beast release
