Director Harish Shankar: దర్శకుడు హరీష్‌శంకర్ ఓ సూపర్చాన్స్ను దక్కించుకున్నట్లున్నారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో హరీష్‌శంకర్ (Director Harish Shankar) ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ టైమ్స్‌లో మైత్రీమూవీమేకర్స్ బాలీ వుడ్‌లోనూ సినిమాలు నిర్మించాలనుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇటు హరీష్శంక్ కూడా ఓ బాలీ వుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా వార్తలూ వచ్చాయి. అయితే ఈ రెండు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇటీవల దర్శకుడు హరీష్‌శంకర్, మైత్రీమూవీమేకర్స్లో ఒకరైన నవీన్ ఎర్నేని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను కలిశారు. సల్మాన్‌ఖాన్ వంటి స్టార్ ఊరికే అపాయింట్మెంట్ ఇవ్వడు కాబట్టి, కథ చర్చలకోసమే నిర్మాతనవీన్, దర్శకుడు హరీష్‌శంకర్ సల్మాన్‌ఖాన్‌ను కలిసినట్లుగా తెలుస్తోంది.
పైగా హరీష్‌శంకర్ కెరీర్లో మంచిహిట్గా గబ్బర్‌సింగ్‌ను చెప్పుకుంటాం. ఈ గబ్బర్‌సింగ్ మూవీ సల్మాన్‌ఖాన్ హిందీలో చేసిన ‘దబాంగ్’కు తెలుగు రీమేక్ అన్న విషయం గుర్తుండే ఉంటుంది. అయితే సల్మాన్‌ఖాన్– హరీష్‌శంకర్ కాంబినేషన్లోని మూవీ రీమేక్ అట. అయితే ఇది ‘డీజే’ చిత్రానికి రీమేక్ అనే టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి. .సల్మాన్‌ఖాన్ వంటి స్టార్ హీరోతో దర్శకుడు హరీష్‌శంకర్ సినిమా చేస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
Pooja hegde: ఎఫ్ 3లో జిగేల్ రాణి?
Happened to witness the mesmerising aura of @BeingSalmanKhan thanks a lot Bhai … had a great time and experienced one of the beautiful moments of life … thanks again for ur precious time … thank you @MytriOfficial Naveen Yerneni gaaru for making this happen pic.twitter.com/OVnWDpLcaG
— Harish Shankar .S (@harish2you) April 12, 2022
మరోవైపు హరీష్‌శంకర్ పవన్‌కల్యాణ్‌తో ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్గా కనిపిస్తారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా ఆరంభం కావాల్సి ఉంది. ఈసినిమాను నిర్మించబోయేది కూడా మైత్రీమైవీమేకర్స్యే కావడం విశేషం. అయితే ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ఆలస్యం అవుతోందని, ఈ లోపు వేరే సినిమా చేయాలనే ప్రయ త్నాల్లో భాగంగానే హరీష్, నవీన్ సల్మాన్‌ఖాన్‌ను కలిశారనే టాక్స్ కూడా ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్నాయి. ఇక పవన్ కల్యాన్, హరీశ్‌శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ మంచి హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
https://twitter.com/harish2you/status/1435819039394197506