Vishwaksen interview :ఆ సినిమా ఓ ట్రంప్‌కార్డు లాంటిది: విశ్వక్ సేన్
Vishwaksen interview: గామి సినిమా కథను దర్శకుడు విద్యాధర చెప్పినప్పుడే ఈ సినిమా తీయడానికి ఐదుసంవత్సరాలు…
Ramcharan Gamechanger: సెప్టెంబరులో గేమ్‌చేంజర్
RamcharanGameChanger: రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ ‘గేమ్‌చేంజర్’. దర్శకుడు శంకర్..ఇటు…
ఆ విషయాలపై ఒకటికి పది సార్లు ఆలోచిస్తాను : విజయ్ కిరగందుర్
ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా ‘సలార్ సీజ్ ఫైర్’ మూవీ ఉంటుంది - హోంబలే…
MrunalThakur : నా పేరు మర్చిపోయిన పర్లేదు…కానీ…
నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'హాయ్ నాన్న'. వైర ఎంటర్టైన్మెంట్…
Daksha Nagarkar: ‘రావణాసుర’లో నా పాత్ర చాలా సర్ ప్రైజింగ్ గా వుంటుంది : దక్షా నాగర్కర్
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా 'రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ఈ చిత్రంలోని హీరోయిన్స్ లో ఒకరైన దక్షా నాగర్కర్ విలేఖరుల సమావేశంలో రావణాసుర విశేషాలని పంచుకున్నారు. రావణాసుర ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?రావణాసుర కోసం నిర్మాత అప్రోచ్ అయ్యారు. మొదట ఇందులో పాత్ర లుక్ గురించి చెప్పారు. చాలా ఎక్సయిటింగా అనిపించింది. దర్శకుడు సుధీర్ వర్మ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. రవితేజ గారి సినిమాలో భాగం అవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. రావణాసురలో మీ పాత్ర ఎలా వుంటుంది ? నటనకు ఆస్కారం వుండే పాత్రేనా ?రావణాసురలో నా పాత్ర గురించి ఇప్పుడే చెప్పకూడదు. ప్రస్తుతానికి అది సస్పెన్స్. నటన విషయానికి వస్తే.. పెర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ వుండే పాత్ర చేశాను. క్రైమ్ థ్రిల్లర్ చేయడం మీకు కొత్త కదా ? ఎలా అనిపించింది ?నేను ఎప్పుడూ కొత్తగానే చేయాలని ప్రయత్నిస్తాను. హోరాహోరిలో మెంటల్ డిస్టర్బ్ గా వుండే అమ్మాయి గా చేశాను. హుషారు లో దిల్ చహతహే తరహ పాత్ర, అలాగే జాంబిరెడ్డి తెలుగు లో మొదటి జాంబి ఫిల్మ్. రావణాసుర కూడా చాలా డిఫరెంట్ మూవీ. ఇందులో నా పాత్ర చూసి సర్ ప్రైజ్ అవుతారు. దర్శకుడు సుధీర్ వర్మ ఈ కథని చెప్పినపుడు ఎలా ఫీలయ్యారు ?సుధీర్ వర్మ గారి గత చిత్రాలు చూశాను. చాలా డిఫరెంట్ గా వుంటాయి. రావణాసుర కథని కలర్ పేలేట్ తో సహా ఎలా వుంటుందో చెప్పారు. ఆయన చెబుతున్నపుడే ఒక సినిమా చూసిన అనుభూతి కలిగింది. ఆయన డైరెక్షన్ లో పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది. ఇందులో చాలా మంది హీరోయిన్స్ వున్నారు కదా.. మీ పాత్రకు ఎంత ప్రాధన్యత వుంటుందో అనే సందేహం రాలేదా ?నాకు అలా ఏం అనిపించలేదు. నాకు ఒక పాత్ర ఇచ్చారు. ఆ పాత్రని ఎంత న్యాయం చేయగలనో అనే దానిపైనే ద్రుష్టిపెట్టాను. నా పాత్రతోనే ఇన్వాల్వ్ అయ్యాను. రవితేజ గారు లాంటి పెద్ద స్టార్ తో పని చేయడం ఎలా అనిపించిది ? ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు ?రవితేజ గారు బిగ్ స్టార్, మాస్ మహారాజా. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. చాలా హంబుల్ గా వుంటారు. సెట్స్ లో చాలా సరదా వుంటారు. ఆయనతో వర్క్ చేయడం మంచి అనుభవం. రావణాసుర బలాలు ఏమిటి ? రవితేజ గారు, దర్శకుడు సుధీర్ వర్మ, సుశాంత్, డీవోపీ, మా టెక్నికల్ టీం ఇలా అందరం కష్టపడి ది బెస్ట్ ఇచ్చాం. సుశాంత్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ? సుశాంత్ గారు చాలా సరదా మనిషి. ఈ సినిమాలో ఆయన్ని చాలా కొత్తగా చూస్తారు. ఎలాంటి పాత్రలలో కనిపించాలని వుంది ?…
Nivetha Pethuraj:నిర్మాణం వైపు మాత్రం వెళ్లను
HEROINE Nivetha Pethuraj INTERVIEW: డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం…
నచ్చిన కథని నిర్మించామనే తృప్తి వుంటుంది : నిర్మాత రాజేష్
సందీప్ కిషన్ కథానాయకుడిగా. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఊరు పేరు భైరవకోన, శ్రీవిష్ణు కథానాయకుడిగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సామజవరగమనా చిత్రాలని హాస్య మూవీస్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పణ లో నిర్మిస్తున్నారు రాజేష్ దండా. ఈ రెండు చిత్రాల విశేషాలని విలేఖరుల సమావేశంలో పంచుకున్నారాయన. నిర్మాతగా మీ ప్రయాణం గురించి? స్వామిరారా చిత్రంతో డిస్ట్రిబ్యూటర్ గా నా ప్రయాణం మొదలైయింది. దాదాపు 82 చిత్రాలు డిస్ట్రిబ్యూటర్ గా చేశాను. సందీప్ కిషన్ గారితో వున్న పరిచయం వలన కేరాఫ్ సూర్య సినిమాకి కో ప్రొడ్యూసర్ గా చేశాను. తర్వాత ఒక్క క్షణం, నాంది సినిమాలకి కో ప్రొడ్యూసర్ గా చేశాను. నాంది విడుదల తర్వాత మనమే ఎందుకు నిర్మాతగా చేయకూడదని అనిపించింది. టైగర్ సినిమా నుంచి సందీప్ కిషన్, విఐ ఆనంద్ నాకు మంచి ఫ్రెండ్స్. ప్రొడక్షన్ మొదలుపెట్టండి నేను సినిమా చేస్తా’ అని సందీప్ కిషన్, డైరెక్టర్ గారు అన్నారు. అలా హాస్య మూవీస్ బ్యానర్ స్టార్ట్ అయ్యింది. అనిల్ సుంకర గారితో నాకు మంచి అనుబంధం వుంది. ఆయన బ్యానర్ లో ఆరు సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ గా చేశాను. ఆయన సపోర్ట్ తో మరో రెండు సినిమాలు స్టార్ట్ అయ్యాయి. మొదట నిర్మించింది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కదా ? దాని ఫలితం తృప్తిని ఇచ్చిందా ?మేము మొదట స్టార్ట్ చేసిన చిత్రం ఊరు పేరు భైరవకోన. కొన్ని కారణాల వలన అది ఆలస్యమైయింది. దీంతో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ముందు విడుదలైయింది. కమర్షియల్ సక్సెస్ మాట పక్కన పెడితే మంచి సినిమా తీశాననే పేరు తీసుకొచ్చింది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఓటీటీలో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఊరు పేరు భైరవకోన, సామజవరగమనా సినిమాల విడుదల ఎప్పుడు ?సామజవరగమనా సమ్మర్ లో విడుదలౌతుంది. ఊరు పేరు భైరవకోన చాలా పెద్ద స్కేల్ లో సూపర్ నేచురల్ ఫాంటసీగా చేస్తున్నాం. చాలా సీజీ వర్క్ వుంటుంది. జులై లేదా ఆగస్ట్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. ఊరు పేరు భైరవకోన లో గ్రాండ్ విజువల్స్, ఫన్, మంచి పాటలు వుంటాయి. మంచి కమర్షియల్ సినిమా ఇది. డిస్ట్రిబ్యూషన్ అంటే డబ్బులు పోగొట్టుకోవడమే ఎక్కువ అనే భావన వుంది కదా ?డిస్ట్రిబ్యూటర్ గా నాకు సక్సెస్ ఎక్కువ. ఏడాది లో పది సినిమాలు విడుదల చేస్తే ఎనిమిది హిట్లు. స్వామి రారా, కార్తికేయ, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, రారా కృష్ణయ్య, నిను వీడని, ఎన్టీఆర్ గారి టెంపర్, మహేష్ బాబు గారి సరిలేరు నీకెవ్వరు ఇలా సెలెక్టెడ్ గా వెళ్లాను. డిస్ట్రిబ్యూషన్ లో విజయవంతంగానే వచ్చా. ఊరు పేరు భైరవకోన భారీ స్థాయిలో వుంటుంది అని సందీప్ కిషన్ గారు చెప్పారు ? బడ్జెట్ విషయంలో రిస్క్ అనిపించలేదా ?ఊరు పేరు భైరవకోన అద్భుతమైన కథ. సూపర్ నేచురల్ ఫాంటసీ ఫిల్మ్. ఖర్చు విషయంలో రిస్క్ అనుకోవడం లేదు. కథ అనుకున్నప్పుడే దిన్ని పెద్ద చేయాలని దిగాం. అప్పుడే డిస్ట్రిబ్యూషన్ నుంచి ఎంతకి ఇస్తారా అని అడుగుతున్నారు. టీజర్ పడే దాక దాని గురించి ఇప్పడే వద్దని చెప్పాం. డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ లో ఏది సులువు? ఏది కష్టం ?దేని కష్టం దానికి వుంది. అయితే నా వరకూ ప్రొడక్షన్ బావుందని భావిస్తున్నాను. మనకి నచ్చిన కథని నిర్మించామనే తృప్తి వుంటుంది. నెక్స్ట్ ప్లాన్స్ ఏమిటి ?ఆగస్ట్ లో నరేష్ గారితో సోలో గా ఒక సినిమా చేయబోతున్నా. సోలో బ్రతుకే సొ బెటరు ఫేం సుబ్బు గారు దీనికి దర్శకత్వం. అలాగే శ్రీవిష్ణు గారితో మరో సినిమా చర్చలో వుంది. సాయి ధరమ్ తేజ్ గారు నాకు ఇష్టమైన హీరో. ఆయనతో ఒక సినిమా చేయాలని వుంది. అలాగే నాంది దర్శకుడు విజయ్ కనకమేడలతో కూడా ఒక సినిమా చేయాలనే ఆలోచన వుంది.
రాజుగారు అన్న మాటలు మరచిపోలేం : నిర్మాతలు హర్షిత్, హన్షిత
దిల్ రాజు సారథ్యంలో శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత నిర్మించిన సినిమా…
Lyric Writter Ramajogayya Sastry: అప్పుడు ఆ పని దర్శకుడు చూసుకోవాల్సిందే
Lyric Writter Ramajogayya Sastry: ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు…
director vasist interview: ప్రతిరోజూ టైమ్ ట్రావెల్
కళ్యాణ్ రామ్‌గారు, హరిగారు నాపై నమ్మకంతో ‘బింబిసార’ వంటి గొప్ప సినిమాను తీసే అవకాశాన్ని ఇచ్చారు…
Varuntej Ghani: యాక్షన్ హీరో కావాలనే ఇండస్ట్రీకి వచ్చాను
హీరో వరుణ్‌తేజ్ కెరీర్లో ఫస్ట్‌టైమ్ చేసిన స్పోర్ట్స్ ఫిల్మ్ ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు.…
director Swaroop RSJ: బీహార్‌లోని వాస్తవ సంగఘటనల ఆధారంగా
director Swaroop RSj interview ఏ కథ రాసినా కామెడీ, థ్రిల్లర్, డ్రామా వుండేలా చూసుకుంటాను. తెలుగులో `చంటబ్బాయ్` తర్వాత డిటెక్టివ్ సినిమాలు పెద్దగా రాలేదు. లిటిల్ సోల్జర్స్ తర్వాత పిల్లలతో సినిమా రాలేదు. అందుకే వాటికి తగ్గట్టుగా రాసుకుని తీసిన సినిమానే `మిషన్ ఇంపాజిబుల్` అని దర్శకుడు `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. (director Swaroop RSJ) తెలియజేశారు. తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరించారు. ముగ్గురు పిల్లలుగా రోషన్, బానుప్రకాష్, జైతీర్థ నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా శనివారంనాడు చిత్ర దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె మీడియా సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. మిషన్ ఇంపాజిబుల్ అనే కథ 2014లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రాసుకున్నా. దావూద్ ఇబ్రహం అనే వ్యక్తిని పట్టుకుంటే డబ్బులు ఇస్తామని పేపర్ లో వచ్చిన ప్రకటన చూసిన పాట్నాకు చెందిన ముగ్గురు పిల్లలు ముంబై వెళ్ళిపోతారు. ఈ వార్తను కథగా రాసుకున్నాను. కానీ ఆ తర్వాత ఏజెంట్.. కథ డెవలప్ అవ్వడంతో ముందుగా దాన్ని ప్రారంభించా. రెండవ సినిమా ఇలాంటి కథతో రావడం రిస్క్ అనుకోలేదు. నిజాయితీగా కథ చెబితే ప్రేక్షకులు చూస్తారనే పూర్తి నమ్మకం నాకుంది. ఏజెంట్.. సినిమాతో అది నిజమైంది. నా స్నేహితులు కూడా మొదటి సినిమా లవ్, కామెడీ చేయమన్నారు. కానీ నా తరహాలో నిజాయితీగా చెబితే చూస్తారనే డిటెక్టివ్ సినిమా తీశా. మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో మొదట ఎవరైనా హీరోతో చేద్దామనుకున్నాం. కానీ అప్పటికే `ఏజెంట్..` సినిమా చేశాం కదా…